కరీంనగర్‌క్రైం: న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్తామని, న్యాయవాదుల సహకారంతో కే సుల సత్వర పరిష్కారానికి తమవంతు సహకారం అందించాలని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షు డు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులతో అసోసియేషన్ నూతన కార్యవర్గం పరిచ య కార్యక్రమాన్ని మంగళవారం అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. కార్యక్రమాని కి హాజరైన జిల్లా జడ్జితో పాటు ఇతర న్యా యమూర్తులను నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
కరీంనగర్: నగరపాలక సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి అందిస్తున్న 5శాతం ముందస్తు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పౌర సేవా కేంద్రంతో పాటు అదనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పన్నుల చెల్లింపు కౌంటర్లను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ప్రభుత్వం అందిస్తున్న ఎర్లీ బర్డ్ ముందస్తు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, రద్దీని బట్టి మరిన్ని అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వార్డు ఆఫీసర్లు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటికీ వెళ్లి 5శాతం రాయితీ గురించి వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


