తెలంగాణ ఉద్యమకారిణి మల్లమ్మ ఇక లేరు | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమకారిణి మల్లమ్మ ఇక లేరు

Mar 13 2026 7:45 AM | Updated on Mar 13 2026 7:45 AM

వీర్నపల్లి(సిరిసిల్ల): తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల వీరాభిమాని లెంకల మల్లమ్మ (85) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎల్లారెడ్డిపేటలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలిదశ ఉద్యమంలో మల్లమ్మ జెండా పట్టుకొని ప్రతీ ర్యాలీలో పాల్గొంది. వీర్నపల్లిని మండల కేంద్రంగా మార్చాలనే డిమాండ్‌తో జరగిన దీక్షల్లోనూ పాల్గొంది. ఉద్యమ సమయంలో తనవంతుగా ఆర్థికసాయం కూడా అందించింది.

నా పెద్ద కొడుకు పంపిస్తున్నాడుగా..

కేసీఆర్‌ అంటే మల్లమ్మకు అపారమైన అభిమానం. ఎవరైనా అధికారులు వచ్చి అవ్వా పింఛన్‌ వస్తుందా? అని ఆరా తీస్తే శ్రీనా పెద్ద కొడుకు కేసీఆర్‌ నాకు ప్రతీ నెల డబ్బులు పంపిస్తున్నాడు.. నాకేం రంది లేదు..శ్రీ అంటూ సమాధానం ఇచ్చేది. మల్లమ్మ మృతిపై స్థానిక రాజకీయ నాయకులు, ఉద్యమకారులు సంతాపం తెలిపారు. మల్లమ్మ అంతిమయాత్రతో సర్పంచ్‌ మల్లారపు జ్యోత్స్న, సెస్‌ మండల డైరెక్టర్‌ మాడుగుల మల్లేశం, ఉప సర్పంచ్‌ జక్కుల నరేశ్‌, మాజీ ఉప సర్పంచ్‌ బోయిని రవి, మాజీ ఎంపీటీసీ అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement