చేయి ఎత్తిన సంగ్రామం
కరీంనగర్, సిరిసిల్లలో స్పీడ్ పెరిగిన కారు, కమలం వెనుకంజ ప్రశాంతంగా రెండో విడత పోలింగ్ ఓటర్లకు కలిసి వచ్చిన వరుస సెలవులు మహిళల కన్నా ఉత్సాహంగా ఓట్లేసిన పురుషులు 111 పంచాయతీల్లో 86శాతం మించిన పర్సంటేజీ
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ ●:
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక గ్రామాలు తమ ఖాతాలో వేసుకున్న హస్తం పార్టీ అదే జోరును రెండో విడతలోనూ కొనసాగించింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 398 స్థానాలకు 203స్థానాలు కై వసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆదివారం జరిగిన రెండో విడతలో 418కి 234 స్థానాలతో జోరును కొనసాగించి పల్లెపోరులో పట్టు సాధించింది. తొలి విడతలో 121స్థానాలకే పరిమితమైన కారు పార్టీ, రెండో విడతలో 102 గ్రామాలతో అదేస్థాయిలోనే నిలిచింది. రెండో విడతలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. తొలి విడతలో జరిగిన తప్పులను సరిదిద్దుకున్న బీఆర్‌ఎస్, రెండో విడతలో గట్టి పోటీనిచ్చింది. రెండు జిల్లాల్లో కారు పార్టీకి మంచి స్పందన లభించగా, కాంగ్రెస్‌కు సవాల్ విసిరినట్టుగా పరిస్థితి మారింది. మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటేందుకు ప్రయత్నించింది. తొలి విడతలో 37స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ రెండో విడతలో 27 స్థానాలతోనే సరిపెట్టుకుంది.
ప్రశాంతంగా రెండో విడత
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రెండో శనివారం, ఆది వారం సెలవులు కలిసి రావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో తొలివిడతలో 81.42శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో 86.58శాతం రికార్డవడం నిదర్శనం. హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున రావడం పోలింగ్‌శాతం పెరగడానికి దోహదపడింది. ఉదయం 7 గంటల నుంచి మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఉదయం 9 గంటలకల్లా చాలా కేంద్రాల్లో 55శాతం పోలింగ్ దాటడం విశేషం. మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో 86.58శాతం పోలింగ్ నమోదైంది. గన్నేరువరం లో 88.91శాతం పోలింగ్ నమోదైంది.
ఓటెత్తిన పుషులు..
ఈనెల 11న జరిగిన తొలివిడత కన్నా 5శాతం పోలింగ్ పెరిగింది. తొలివిడతలో మహిళలు 82.51 శాతం ఓట్లు వేయగా.. పురుషులు 80.26 శాతానికే పరిమితమయ్యారు. తాజా పోలింగ్‌లో మహిళలు 85.77శాతం ఓటింగ్‌లో పాల్గొనగా.. పురుషులు 87.44శాతం మేర ఓట్లేసి ముందంజలో నిలిచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటట్లలో పురుషులే అధికంగా ఉండటం కూడా ఓటింగ్ పర్సంటేజీ పెరగడంలో కారణంగా చెబుతున్నారు.
మేమూ ఓటేశాం: పచ్చునూరులో ఓటేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతులు
ఇదిగో ఇలా మలవాలమ్మా: కేశవపట్నంలో బ్యాలెట్ పేపర్ గురించి వివరిస్తున్న సిబ్బంది
జిల్లాలో విజయం సాధించిన
వివిధ పార్టీల మద్దతుదారులు
గ్రామపంచాయతీలు 113
కాంగ్రెస్ 45
బీఆర్‌ఎస్ 42
బీజేపీ 09
ఇతరులు 17
మండలం గ్రామాలు మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం శాతం
చిగురుమామిడి 17 34,370 29,498 14,585 86.58 14,913 85.11 85.82
గన్నేరువరం 15 17,430 15,435 7,533 88.19 7,902 88.91 88.55
మానకొండూర్ 29 56,922 49,328 24,360 87.85 24,967 85.52 86.66
శంకరపట్నం 27 37,867 33,334 16,617 89.1 16,717 86.99 88.03
తిమ్మాపూర్ 23 38,414 32,589 15,919 85.59 16,670 84.13 84.84
మొత్తం 111 1,85,003 1,60,184 79,014 87.44 81.169 85.77 86.58
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం
చేయి ఎత్తిన సంగ్రామం


