ఎల్లలు దాటి వచ్చి.. ఓటేసి
రాయికల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా యువతీ, యువకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహ్రెయిన్, యూఎస్‌ఏ, తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో మాట్లాడారు.
యూఎస్‌ఏ నుంచి వచ్చా
నేను యూఎస్‌ఏ హస్టన్ టెక్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నా. కొద్దిరోజుల తర్వాత మా ఊరికి వస్తాననుకున్న. కానీ, ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుగానే వచ్చా. – బొలిశెట్టి భావన, ఇటిక్యాల
ఆనందంగా ఉంది
సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడం ఆనందాన్ని ఇచ్చింది. గ్రామాభివృద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకున్న. – సుప్రియ, ఇటిక్యాల
ప్రతీ ఓటు కీలకం
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కు మంచి అవకాశం. నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్తున్నా.
– సిరిపురం గిరి, డెప్యూటీ తహసీల్దార్,
ఎలిగేడు మండలం, పెద్దపల్లి
నోటిఫికేషన్ రాగానే..
నేను ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో ఉంటున్నా. ప్రతి రెండేళ్లకోసారి నాకు కంపెనీ సెలవు ఇస్తుంది. ప్రస్తుతం మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకుని ఎలాగైనా ఓటు వేద్దామన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ రాగానే స్వగ్రామానికి వచ్చి ఓటు వేశా. – పడాల రమేశ్, కుమ్మరిపల్లి
ప్రలోభాలకు లొంగకుండా..
ఓటు వేసేందుకు ముంబయ్ నుంచి వ చ్చాం. తిరిగి వెళ్తున్నా ం. ప్రతి ఓటు కీలకం కాబట్టి వచ్చినం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్నాం.
– గాజంగి శ్రీధర్, రాజేంద్రప్రసాద్
కుటుంబ సమేతంగా..
హైదరాబాద్ నుంచి సుమా రు 20 మందిమి మా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఆది వారం సెలవు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశాం.
– పారిపల్లి సుధీర్, ప్రైవేటు ఉద్యోగి, కుమ్మరిపల్లి


