పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ సీటు
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ దక్కింది. పట్టణంలోని గీతానగర్‌కు చెందిన యువకుడు రెడ్డిమల్ల అభినవ్ సాయి నీట్ పీజీ 2025–26 ప్రవేశ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో 716వ ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్‌ఎంఎల్) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ సీటు కైవసం చేసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రేషన్ డీలర్ రెడ్డిమల్ల హన్మాండ్లు–కల్యాణి దంపతుల కొడుకు అభినవ్‌సాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఆర్‌ఎంఎల్‌లో సీటు సాధించడంతో ఆదివారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. అభినవ్‌సాయి సోదరుడు గుణశేఖర్ సైతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రోడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేశ్, సమ్మయ్య, భాను, ప్రతినిధులు గట్టయ్య, రవీందర్, ఆకునూరి బాలరాజు, రాజయ్య, మహేశ్, శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, నర్సయ్య, గాజుల శ్రీనివాస్, ప్రసాద్, చంద్రం, శంకర్, శ్యామ్, శోభన్ పాల్గొన్నారు.
ఆర్‌ఎంఎల్ మెడికల్ కాలేజీలో సీటు
అభినందించిన రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు


