చలో ‘గురుకులం’
కరీంనగర్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా 2026– 27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంగ్లిష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జోనల్ పరిధిలో50 గురుకులు పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలలో జిల్లాలో 2,227పై సీట్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 5, జగిత్యాలలో 5, పెద్దపల్లిలో6, రాజన్న సిరిసిల్లలో 7 కలిపి 23 గురుకులాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో చింతకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, జగిత్యాల జిల్లాలో మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, గొల్లపల్లి, పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని, రామగుండం, నందిమేడారం, మల్లాపూర్, గొల్లపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి, వేములవాడ, చిన్నబోనాల, బోయినపల్లి, ముస్తాబాద్, నర్మాల, ఇల్లంతకుంట లలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు రాజన్నసిరిసిల్ల జోన్ పరిధిలో గురుకులాలు కుండా కరీంనగర్ జోన్ పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లు గరిష్ట సడలింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.
కరీంనగర్ జోన్‌ల్ పరిధిలో 2,227 సీట్లు
ఉమ్మడి జిల్లాలోని 23 గురుకులాల్లో 5వ తరగతిలో ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్ల చొప్పున 1,840 సీట్లు ఉన్నాయి. కరీంనగర్‌లో జోన్‌ల్ పరిధిలో మిగితా పాఠశాలలున్నాయి. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధనతో పాటు, భోజనవసతితో పాటు సకల వసతులు ఉంటాయి. సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉండనుంది. ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ,ౖ మెనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు ఉచితంగా చదువు, హస్టల్‌తో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తారు. బట్టలు, పుస్తకాలు, కాస్మోటిక్ చార్జీలు అందించనున్నారు.
జనవరి 21 వరకు దరఖాస్తు గడువు
5వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 22 ఫిబ్రవరి 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్‌నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. వేరే వారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై సెక్షన్ 416 ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 2025లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో గుర్తించిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధన కావడంతో పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటి నెలకొంది. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జనవరి 21 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. కరీంనగర్ జోనల్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకై అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– కె.ప్రత్యూష, గురుకులాల జోనల్ ఆఫీసర్
5వ తరగతిలో ప్రవేశాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జనవరి 21 వరకు గడువు
ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష
కరీంనగర్ జోనల్ పరిధిలో 50 గురుకులాలు


