కొత్త ఓటు.. అవగాహన లోటు | - | Sakshi
Sakshi News home page

కొత్త ఓటు.. అవగాహన లోటు

Dec 15 2025 1:33 PM | Updated on Dec 15 2025 1:33 PM

కొత్త

కొత్త ఓటు.. అవగాహన లోటు

నాకు తెలియదు ఈవీఎం అనుకున్న సంతోషంగా ఉంది

మానకొండూర్‌: సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన నూతన ఓటర్లలో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కరువు అవడంతో అయోమయానికి గురయ్యారు. చాలామంది నూతన ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడని అనుకున్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేయాలని పోలింగ్‌ కేంద్రంలో తెలుసుకున్నాక అయోమయానికి గురయ్యారు.

నాకు తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటు వేసుడు ఏ విధంగానో నాకు తెలియదు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు కొంత కంగారుగా ఉండే. మొదటి సారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది.

– రసజ్ఞ, గంగిపల్లి

నేను తొలిసారిగా ఓటు వేస్తున్నా. ఓటుహక్కు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేసుడనుకున్నా. బ్యాలెట్‌ పేపర్‌లో ఏ విధంగా ఓటు వేసుడో తెలియదు. అవగాహన కల్పించాల్సి ఉంది.

– మమత, గంగిపల్లి

తొలిసారి నాకు ఓటు హక్కు వచ్చి ంది. ఓటు వేయడం సం తోషంగా ఉంది. ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడనుకుంటున్నా. ఓటు ఏ విధంగా వేయాలో తెలియ దు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎలా వేయాలో తెలుసుకుంటా.

– కొలిపాక అఖిల( కొండపల్కల)

ఈవీఎంలు ఉంటాయనుకున్నా యువ ఓటర్లు

బ్యాలెట్‌ పేపర్లతో అయోమయం

కొత్త ఓటు.. అవగాహన లోటు1
1/2

కొత్త ఓటు.. అవగాహన లోటు

కొత్త ఓటు.. అవగాహన లోటు2
2/2

కొత్త ఓటు.. అవగాహన లోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement