అనారోగ్యంతో కూలి మృతి
చందుర్తి(వేములవాడ): నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్థితిలో ఓ నిరుపేద ప్రాణాలు వదిలాడు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మేడారం మురళి(58) కులవృత్తిని చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రితం సైకిల్‌పై నుంచి జారిపడ్డాడు. అప్పటి నుంచి మంచంపట్టి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక శనివారం ప్రాణాలు కోల్పోయాడు. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మై వేములవాడ చారిటబుట్ ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య వనజ, ఇద్దరు కుమారులు నరేశ్, రాజశేఖర్ ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


