మాట మీద ఉండే వారు
మాది కోనరావుపేట మండలం నాగారం. 1980లో నాగారం సర్పంచ్‌గా పనిచేశాను. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్‌గా గుర్తింపు, గౌరవం ఉండేది. నేను వేములవాడ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశాను. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. ఆనాటి గౌరవం, మర్యాద ఇప్పటితరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరును చూస్తే బాధగా ఉంది. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే.. ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతుంది. – మ్యాకల భూమయ్య,
నాగారం మాజీ సర్పంచ్


