నేను 14 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశాను
మాది కోనరావుపేట మండలం మల్కపేట. నేను రాజేంద్రనగర్‌లో బీఎస్పీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. మా ఊరిలో 1980లో తొలిసారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 1994 వరకు 14 ఏళ్లపాటు సర్పంచ్‌గా ఉన్నాను. ఎన్నికల్లో అప్పట్లో ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. పైసా ఖర్చు లేకుండానే ఎన్నికయ్యాను. నేను అంతే నిజాయితీగా ఉండి గ్రామాభివృద్ధికి పనిచేశాను. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్నికల పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైంది.
– చెలిమెడ రాజేశ్వర్‌రావు,
మల్కపేట మాజీ సర్పంచ్, డెయిరీ చైర్మన్


