వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలోని పలు పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు వార్డుస్థానాలకు పోటీపడుతున్నారు. అందుగులపల్లి పంచాయతీలో మాజీ ఉపసర్పంచ్ తలారి స్వప్న మళ్లీ వార్డు సభ్యురాలిగా పోటీపడుతుండగా ఈసారి ఆమె భర్త తలారి సాగర్ కూడా వార్డు సభ్యుడిగా వేర్వేరు స్థానాల్లో పోటీచేస్తున్నారు. అలాగే గుర్రాంపల్లి పంచాయతీలో సుల్తాన్‌కుమార్ 6వ వార్డులో, ఆయన భార్య విజయ 7వ వార్డులో పోటీకి దిగారు. ఇక కాసులపల్లి పంచాయతీలో వెల్ది రాజ్యలక్ష్మి 3వ వార్డులో, ఆమె కొడుకు వెల్ది సాయిచంద్‌రావు 2వ వార్డులో పోటీ చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ప్రచారం సమయం ముగిసి 48 గంటల సైలెంట్ పీరియడ్‌లో కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో సిరిసిల్లకు చెందిన సంపత్ శనివారం ప్రచారం చేస్తుండగా ఎఫ్‌ఎస్‌టీ టీమ్ గుర్తించి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సుల్తాన్ కుమార్, విజయ
తలారి సాగర్, స్వప్న
వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ
వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ
వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ


