అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
నేను వేములవాడ పాతసమితి పరిధిలోని రుద్రవరం సర్పంచ్‌గా 1964లో ఏకగ్రీవమయ్యాను. అప్పటికే నేను నిజాం కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న అనంతరావు సిరిసిల్లలో అడ్వకేట్‌గా ఉన్నారు. ఊరిలో సేవచేయాలని సర్పంచ్‌ను చేశారు. అప్పటి నుంచి 1980 వరకు మూడుసార్లు ఏకగ్రీవంగానే సర్పంచ్‌గా పనిచేశారు. రాష్ట్రస్థాయిలో రుద్రవరం ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై ంది. అప్పట్లో డబ్బు ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. నేను 1980 నుంచి 1986 వరకు వేములవాడ సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. 1987 నుంచి 1992 వరకు ఎంపీపీగా పనిచేశాను. కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్‌గా, 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేశాను.
– రేగులపాటి పాపారావు, రుద్రవరం మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే


