మూడుసార్లు సర్పంచ్‌గా ఉన్నాను
మాది గంభీరావుపేట మండలం శ్రీగాధ. నేను 1981లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో నేను చేసిన పనులకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉండేది. వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా పనిచేశాను. ఎన్నికల్లో అప్పుడు రూ.130 మాత్రమే ఖర్చు అయింది. ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీదనే ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాధించుకోవడమే లక్ష్యమైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి.
– గౌరినేని మాణిక్యారావు, శ్రీగాధ, మాజీ సర్పంచ్


