
కుట్టుమిషన్‌తో స్వయం ఉపాధి
కుట్టుమిషన్ శిక్షణతో స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ తీసుకుంటున్న. మహిళలకు ఆర్థికంగా ఆదాయం ఉంటే,కుటుంబం సాఫీగా సాగుతుంది. ఉచితంగా శిక్షణ అందజేస్తున్న డాక్టర్ బీ.ఎన్.రావు ఫౌండేషన్‌కు రుణపడి ఉంటాం. నేను నేర్చుకున్న విద్యను మరింతమందికి అందజేస్తాను. మహిళలు రోజంతా ఎండలో కష్టపడినా కూలీ గిట్టుబాటు కావడం లేదు. కుట్టు మిషన్‌తో ఇంటివద్దే స్వయం ఉపాధి పొందుతూ, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటాం.
– కవిత, మల్యాల
ప్రతి ఇంట్లో మహిళలతోనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుట్టు మిషన్ శిక్షణతో ఇంటి వద్దే ఉపాధి పొందే మార్గం లభిస్తుంది. కుటుంబ సభ్యుల దుస్తులు కుట్టడంతోపాటు, స్వయం ఉపాధి లభిస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం చేయకుండ మహిళలకు అవకాశం ఇస్తే, అన్నిరంగాల్లో ఆకాశమే హద్దుగా రాణిస్తాం. మహిళలు కుటుంబానికి దిక్సూచీ. మహిళలు అభివృద్ది చెందితే కుటుంబం, తద్వారా రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతాయి.
– మౌనిక, మల్యాల
ప్రతి కుటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉండడంతో పా టు, ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబి రా లు నిర్వహిస్తూ, ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. కుట్టుమిషన్ ఉచిత శిక్షణ ద్వారా మహిళలు ఇంటి వద్ద స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా మహిళా సాధికారికత సాధించేందుకు కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, మల్యాలలో ఉచిత శిక్షణ ప్రారంభించినం.
– బీఎన్ రావు, ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్

కుట్టుమిషన్‌తో స్వయం ఉపాధి

కుట్టుమిషన్‌తో స్వయం ఉపాధి