
అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్‌లో వరల్డ్ ఎక్స్‌పో 2025
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో స్కూ ల్‌లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఎక్స్‌పో 2025ను శనివారం ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రపంచంలోని దేశాల్లో అమలుపరుస్తున్న వివిధ విద్యా విధానాలు, రాజకీయ పద్ధతులు, బోధనా పద్ధతులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, ఆహారపు అలవాట్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాల గురించి వర్ణించే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక అవగాహన పెంపొందించేందుకు, వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.