
గనుల్లో పనులు.. ఆటల్లో ఘనులు!
● పరుగెడితే పతకమే.. ● ఆటాడితే విజయమే
● గురితప్పని నల్లసూరీళ్లు ● క్రీడల్లో రాణిస్తున్న సింగరేణి కార్మికులు
కోలిండియా కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు
గోదావరిఖని: గురిపెడితే పతకాల పంటే.. సింగరే ణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ కోలిండియా స్థాయి పో టీల్లో సత్తా చాటుతున్నారు కార్మికులు, ఉద్యోగులు. సింగరేణి కీర్తిపతాకాన్ని ఆకాశానికి ఎగురవేస్తున్నా రు. కోలిండియాస్థాయి క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, క బడ్డీ, క్యారెమ్స్, అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్ టె న్నిస్, బ్రిడ్జి, లాన్ టెన్నిస్, చెస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, కల్చరల్ విభాగాల్లో ఏటా కోలిండియాస్థాయిలో పోటీలు ని ర్వహిస్తున్నారు. తొలుత డిపార్ట్‌మెంట్, రీజియన్‌స్థా యిలో సత్తాచాటిన ఉద్యోగులను కోలిండియా స్థా యికి ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో క్రీడాకారులు పోటీల్లో సత్తా చాటుతున్నారు.
దేశవ్యాప్తంగా 10 బొగ్గు సంస్థలు..
కోలిండియా స్థాయి పోటీల షెడ్యూల్‌కు అనుగుణంగా డిపార్ట్‌మెంట్, రీజియన్, సింగరేణిస్థాయి పోటీలను ఏటా నిర్వహిస్తోంది. సింగరేణితో పాటు వెస్ట్రకోల్‌ఫీల్డ్స్, నార్తన్ కోల్‌ఫీల్డ్స్, సెంట్రల్ కోల్‌ఫీల్త్స్, ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్డ్‌ఫీల్డ్స్, కుకింగ్ కోల్ లిమిటెడ్, కోలిండియా లిమిటెడ్, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, నార్త్‌ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్, సీఎంపీడీ ఐ సంస్థలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో సింగరేణి క్రీడాకారులే అత్యధిక పతకాలు సాధిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు.