
బాలాలయంలోకి రాజన్న
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో భక్తులకు దర్శనాలు కొనసాగించేందుకు ఉత్సవమూర్తులను శనివారం తీసుకొచ్చారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆలయంలో కోడెలను తిప్పి పూజలు చేసి కోడెమొక్కులు ప్రారంభించారు. భీమన్నగుడిలోని మండపంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. అన్నదాన సత్రం పై అంతస్తులో నిత్యకల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులను ప్రారంభించారు. ఆర్డీవో రాధాభాయి, తహసీల్దార్ విజయ్రపకాశ్‌రావు, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్, జయకుమారి, స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, సురేశ్, రాజేశ్వరశర్మ పాల్గొన్నారు.
టెంపుల్ సిటీగా వేములవాడ
– ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ రాజన్న ఆలయంతోపాటు పట్టణాభివృద్ధిని సమాంతరంగా చేపడుతూ వేములవాడను టెంపుల్‌సిటీగా మార్చుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బాలాలయం భీమన్నగుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధిలో అందరి సహకారం తీసుకుంటామన్నారు. ఈనెల 19, 20న శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర స్వామీజీ వేములవాడ వస్తున్నట్లు చెప్పారు.
భీమన్న గుడిలో దర్శనాలు
రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా బాలాలయంలోకి ఉత్సవమూర్తులు తరలించినప్పటికీ అటు రాజన్నగుడిలో నిత్యకైంకర్యాలు భీమన్నగుడిలో దర్శనాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
భీమన్న గుడిలో ప్రతిష్ఠ, కోడెమొక్కులు షురూ
19న శృంగేరి పీఠాధిపతి రాక

బాలాలయంలోకి రాజన్న