
పేగు తెంచి.. కిడ్నీ పంచినా..
చొప్పదండి: పేగు తెంచిన బంధం కన్న బిడ్డకు కిడ్నీ దానం చేసినా ఫలితం దక్కలేదు. మూడు పదుల వయస్సు కూడా నిండని బిడ్డకు కొత్త జీవితం ప్రసాదించానని సంతోషించిన మాతృమూర్తికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. మండలంలోని గుమ్లాపూర్‌కు చెందిన పెరుమాండ్ల అంజయ్య, శా రద దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మనోజ్‌గౌడ్ (27) జీవనోపాధికి దుబాబ్ వెళ్లి వచ్చాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయాలని సూచించడంతో తల్లి శారద తన కిడ్నీని కుమారుడికి మార్పిడి చేసింది. తర్వాత మనోజ్ ఆరోగ్యంగా ఉండడంతో మోతె గ్రామానికి చెందిన వసంతతో వివాహం జరిపించారు. ఆనందంగా సా గుతున్న జీవితం మరో మలుపు తిరిగింది. శుక్రవారం మళ్లీ అనారోగ్య సమస్య రావడంతో మనో జ్‌ను హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుమారుడి కోసం కిడ్నీ మార్పిడి చేసినా ఆ ఆనందం ఎంతో కాలం నిలవక పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ఫలితం
అనారోగ్యంతో యువకుడి మృతి