
వర్షాకాలం విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలి
కొత్తపల్లి(కరీంనగర్): భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌తో వినియోగదారులు/ రైతులు జాగ్రత్తగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు కోరారు. సొంతంగా విద్యుత్ పనులు చేసుకుంటూ ప్రమాదాలకు గురికావద్దని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో విద్యుత్‌శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇళ్లలో బట్టలు ఆరేసే జీఐ వైర్లతో విద్యుత్ వైర్లలో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయి షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. పశువుల యాజమానులు మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రా న్స్‌ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్ర త్త వహించాలన్నారు. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్ సేవలను పొందాలని సూచించారు.
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
రామడుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని, బీజేపీ సత్తా చాటడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలి పారు. రామడుగు మండలం షానగర్‌లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల మండల ఆధ్యక్షుడు మోడీ రవీందర్ ఆధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు, 420హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, మళ్లీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంతో రాజ కీయ నాటకాలు మొదలు పెట్టిందని, 10శాతం రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా చేపట్టిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్‌యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విద్యాసాగర్, కరుణాకర్‌రెడ్డి, జాడి బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
కరీంనగర్: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల(ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐపీఎస్‌యూ) ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.8,000 కోట్లకు పైగా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చే యాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలన్నా రు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.
అరగంట ముందే సేవలు ప్రారంభించాలి
కరీంనగర్ కల్చరల్: ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో శ్రావణమాసం సందర్భంగా జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 23వరకు ఉత్సవాలు జరుగుతాయని, అరగంట ముందుగానే ఆలయాల్లో సేవలు ప్రారంభించాలని దేవాదాయ, ధర్మదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ నాయిని సుప్రియ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వ్రతాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. వనమహోత్సవంలో భాగంగా దేవాదా యశాఖలో ఆర్థిక వనరుల లేమి, సిబ్బంది లేకపోవడంతో లక్ష్యంలో మిగిలిన మొక్కలు కరీంనగర్ కార్పొరేషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు బదలాయిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ కోరడం జరిగిందన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. కరీంనగర్‌లో మిగిలిన మొక్కల లక్ష్యాన్ని అప్పగిస్తామని తెలిపారు.

వర్షాకాలం విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలి