దోపిడీ దొంగల ముఠా పట్టివేత | - | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల ముఠా పట్టివేత

Jul 24 2025 7:24 AM | Updated on Jul 24 2025 7:24 AM

దోపిడ

దోపిడీ దొంగల ముఠా పట్టివేత

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడ బీరయ్య టెంపుల్‌ వద్ద పని నిమిత్తం వచ్చిన జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడకు చెందిన ఇనుగుర్తి శంకరయ్యను ముగ్గురు బెదిరించి.. ఓ ఇంటికి తీసుకెళ్లి అతడి వద్దనున్న పావుతులం బంగారంతోపాటు రూ.లక్ష ఫోన్‌పే చేయించుకున్న నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కల్లెడకు చెందిన ఇనుగుర్తి ఈశ్వరయ్య మంగళవారం జగిత్యాలకు వచ్చాడు. అదే గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్‌ ఫోన్‌చేసి ఎక్కడున్నాడో తెలుసుకొని.. హనుమాన్‌వాడలోని బీరయ్యగుడి వద్దకు చెట్ల మల్లేశ్‌, హనుమాన్‌వాడకు చెందిన పాలకుర్తి రాజుతో కలిసి చేరుకున్నాడు. శంకరయ్యను బెదిరించి, పాలకుర్తి రాజు ఇంట్లోకి తీసుకెళ్లి దాడిచేసి పావుతులం బంగారం లాక్కున్నారు. బాధితుడి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా రూ.లక్ష బండి శ్రీకాంత్‌ ఖాతాకు పంపించుకున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటల సమయంలో బండి శ్రీకాంత్‌, చెట్ల మల్లేశంతోపాటు మరో ఇద్దరు జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ఉల్లెందుల సతీశ్‌, పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బడుగు మురళీ కారులో శంకరయ్యను ఎక్కించుకొని సారంగాపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కత్తులతో బెదిరించి మరిన్ని డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలోనే సారంగాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఏలేటి మోహన్‌రెడ్డి, రేచపల్లికి చెందిన అన్నారం రఘు, బండి మధులను పిలిపించి అసలు విషయం తెలిపారు. దీంతో వారు కూడా అతన్ని బెదిరించేందుకు ఒప్పుకున్నారు. బాధితుడిని బైక్‌పై కల్లెడకు తీసుకెళ్లగా.. వాళ్ల అమ్మ మెడలోని పుస్తెలతాడును తీసుకొచ్చాడు. ఆ పుస్తెలతాడును జగిత్యాలలోని టవర్‌ ప్రాంతంలోని బాలాజీ జువెల్లరీ షాపులో విక్రయించి డబ్బులు తీసుకుంటుండగా బాధితుడి బావ తుమ్మనపల్లి రమేశ్‌ వచ్చి విషయం తెలుసుకొని ఠాణాకు వస్తుండగా మళ్లీ ఆపి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మంగళవారం సాయంత్రం బాధితుడు శంకరయ్య పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పావుతులం బంగారం, ఫోన్‌పే ద్వారా రూ.లక్ష, రెండు బైక్‌లు, రెండు కార్లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బండి శ్రీకాంత్‌పై 22 కేసులు, పడెల మల్లేశంపై 3, పాలకుర్తి రాజుపై 10 కేసులున్నట్లు వివరించారు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన పట్టణ సీఐ కరుణాకర్‌, పట్టణ ఎస్సై సుప్రియ, ట్రాఫిక్‌ ఎస్సై మల్లేశ్‌ను ఎస్పీ అభినందించారు. రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సైలు సధాకర్‌, కుమారస్వామి, సుప్రియ, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది మంది అరెస్ట్‌

రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఫోన్లు స్వాధీనం

దోపిడీ దొంగల ముఠా పట్టివేత1
1/1

దోపిడీ దొంగల ముఠా పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement