
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలోని నందివాగు ఆవరణ కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారిపై రుద్రంగికి చెందిన సిర్రం వెంకటేశ్(48) అనుమానాస్పదంగా మృతిచెందాడు. రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు. సిర్రం వెంకటేశ్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని వెళ్లిన యువకుడి అదుపులోకి తీసుకొని విచారించగా ఇంటి వద్ద దించివెళ్లినట్లు తెలిపాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆకస్మికంగా విద్యార్థిని..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హై స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని కుష్బూ(14) బుధవారం ఆకస్మికంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాలిక మృతితో తల్లిదండ్రులు భాగ్దేవి, సురేశ్ కన్నీటి పర్యంతమయ్యారు. కుష్బు మృతికి ఎంఈవో మహేశ్‌కుమార్, ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రద్ధాంజలి ఘటించారు.
కువైట్‌లో ఖాసీంపేట వాసి..
గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన బత్తుల సాగర్(42) ఉపాధి కోసం కువైట్ వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సాగర్ మూడేళ్లుగా కువైట్ వెళ్తూ.. హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామం వచ్చి తిరిగి వెళ్లాడు. ఈ నెల 22వ తేదీన పని ప్రాంతంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తోటి మిత్రులు సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. సాగర్‌కు తల్లిదండ్రులు, సోదరుడు, భార్య సారవ్వ, కూతురు ఉన్నారు. గురువారం మృతదేహం గ్రామానికి చేరుకోనున్నట్లు స్థానికులు తెలిపారు.
స్వగ్రామానికి మృతదేహం
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్‌కు చెందిన బత్తిని రమేష్ గౌడ్ (43) మృతదేహం బుధవారం స్వగ్రా మం చేరింది. రమేశ్ 14 ఏళ్లుగా గల్ఫ్ దేశమైన బెహరాన్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురై వారంక్రితం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రమేశ్‌కు భార్య మేఘన, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి