కూలిన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
ధర్మపురి: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పెంకుటిల్లులు కూలిపోయాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నేరెల్ల గ్రామంలో ఓరుగంటి లక్ష్మి ఆశయ్య, మంత్రి భూమక్కకు చెందిన పెంకుటిల్లులు ఆదివారం కూలిపోయాయి. ఇళ్లలో ఉన్నవారు పనులకు వెళ్లడంతో ఇంటి పైకప్పులు కూలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు జాజాల రమేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రెడ్డవేని సత్యం పరిశీలించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూడాలని కోరారు.
నేరెల్లలో కూలిన ఇల్లు


