కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
● యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్టు అరుణ్‌కుమార్
కరీంనగర్‌టౌన్: సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల డయాలసిస్ వరకు వేళ్లే ప్రమాదం ఉంటుందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అరుణ్‌కుమార్ పొన్న తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. సిరిసిల్లకు చెందిన రాధ అనే మహిళ నొప్పులకు సంబంధించిన పేయిన్‌కిల్లర్ ఇంజక్షన్ వేసుకోగా రెండు రోజుల తర్వాత జ్వరం వాంతులు ఎక్కువై యశోద ఆసుపత్రికి వచ్చిందన్నారు. వెంటనే పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సీరం క్రియాటిన్ 6.0 ఉన్నట్లు తేలిందన్నారు. మరో రెండు రోజుల్లోనే క్రియాటిన్ 10.0కు చేరడంతో మూత్ర పిండాలు పనిచేయడం మానేశాయన్నారు. అయినప్పటికీ డయాలసిస్‌కు వెళ్లకుండా రోగ నిర్ధారణపై దృష్టిపెట్టి ఒక కిడ్నీ బయాప్సీ నిర్వహించినట్లు తెలిపారు. పేయిన్‌కిల్లర్ ఇంజక్షన్ కారణంగా అలర్జీ వచ్చినట్లు గుర్తించామన్నారు. దీనికి తగిన విధంగా చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేయిన్ కిల్లర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మూత్ర పిండాల సమస్య ఉంటే తొందరగా డయాగ్నొస్టిక్ చేయడం వల్ల డయాలసిస్ సమస్య నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.


