పనిమనిషే హంతకురాలు | - | Sakshi
Sakshi News home page

పనిమనిషే హంతకురాలు

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

పనిమనిషే హంతకురాలు

గతంలోనూ దొంగతనం..

● వృద్ధురాలి హత్య కేసును

ఛేదించిన పోలీసులు

● వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలను దోచుకునేందుకు తన భర్తతో కలిసి పనిమనిషి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ముస్రిఫ్‌బాగ్‌కు చెందిన చిట్మల్ల అనసూయ (66) అనే మహిళ గతనెల 29న సాయంత్రం హత్యకు గురయ్యింది. హతురాలి భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె మెడపై గాయాలు ఉండడంతో పాటు మెడలో పుస్తెల తాడు, ఉంగరాలు, చెవి ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్య, దోపిడీ కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. బతుకమ్మ కుంటలో నివసించే పనిమనిషి బోసు రజితను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్త నర్సింగ్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు నిందితురాలు నేరాన్ని అంగీకరించిందని ఎస్పీ తెలిపారు.

పక్కా ప్రణాళికతో...

పనిమనిషి రజిత తన యజమానురాలు అనసూ య మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అనసూయ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయాన్ని అనుకూలంగా మలచుకుంది. గతనెల 29న సా యంత్రం అనసూయ ఇంట్లో దీపం వెలిగిస్తుండ గా.. రజిత, ఆమె భర్త నర్సింగ్‌ కరెంటు సరఫరా ని లిపివేసి ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధురాలిని కింద పడేసి లోపలి గదిలోకి ఈడ్చుకెళ్లి తువ్వాలను గొంతుకు బిగించి చంపారు. ఒంటిపైనున్న పుస్తెలతా డు, రెండు ఉంగరాలు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయారు. ఏమీ ఎరుగనట్లు ఎప్పటిలాగే రోజూ పనికి వస్తున్న రజిత.. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించింది.

గత చరిత్ర తెలుసుకోవాలి

ఇళ్లలో ఎవరిని పడితే వారిని పనిమనుషులుగా పెట్టుకోవవద్దని ఎస్పీ రాజేశ్‌చంద్ర సూచించారు. పనికి వచ్చే వారి గత చరిత్ర తెలుసుకోవాలని, కిరాయి కావాలంటూ వచ్చే వ్యక్తుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

హంతకులను కఠినంగా శిక్షించాలి

అనసూయను హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు. ఎ స్పీ కార్యాలయానికి వచ్చిన కుటుంబ సభ్యులు.. త మకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దన్నా రు. చట్ట ప్రకారం శిక్ష పడేలా న్యాయస్థానం ముందు అన్ని వివరాలు ఇస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

హత్య, దోపిడీ కేసుల్లో నిందితురాలైన రజిత.. గతంలోనూ తాను పనిచేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది. 2023 సెప్టెంబర్‌లో తాను పనిచేసిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా లుగు తులాల బంగారు పుస్తెల తాడు, బంగా రు చెవికమ్మలు దొంగలించినట్టు పనిమనిషి రజిత చెప్పిందని ఎస్పీ తెలిపారు. అప్పట్లో మూసివేసిన ఆ కేసును రీఓపెన్‌ చేస్తున్నామన్నా రు. దోపిడీ, హత్య కేసులో భార్యాభర్తలిద్దరినీ రిమాండుకు పంపుతున్నామన్నారు. వారి వద్దనుంచి బంగారు పుస్తెలతాడు, రెండు బంగారం ఉంగరాలు, చెవి ఆభరణాలు, నిందితురాలి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు పరిశోధనకు సంబంధించి డీఎస్పీ మధుసూదన్‌, సీఐ నరహరిలను ఎస్పీ అభినందించారు. ఎస్సై సాయికృష్ణ, ఏఎస్సై రంగారావ్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు రామస్వామి, రాజునాయక్‌, సంపత్‌లకు క్యాష్‌ రివార్డులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement