ఐక్యతతోనే సమ సమాజ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఐక్యతతోనే సమ సమాజ నిర్మాణం

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

ఐక్యతతోనే సమ సమాజ నిర్మాణం

● కులాలకు అతీతంగా

ప్రజలు కలిసి ఉండాలి

● సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌

లింగంపేట: గ్రామాల అభివృద్ధి, ప్రజల ఐక్యతతోనే సమ సమాజ నిర్మాణం సాధ్యమని సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్‌ అప్పాల ప్ర సాద్‌ పేర్కొన్నారు. సోమవారం లింగంపేట సమీపంలోని జీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన 20 గ్రామాలకు చెందిన గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వకా లంలో గ్రామీణ సమాజంలో కులాలకు అతీతంగా జ నం ఆత్మీయంగా ఉండేవారని పేర్కొన్నారు. పరస్పర సహకారం, సోదరభావం, ఐకమత్యంతో ప్రజలు జీ వించేవారన్నారు. విదేశీ పాలకులు విభజించి పాలించే విధానాలను అవలంబించడం వల్ల సమాజంలో వి భేదాలు పెరిగి కులాలు, వర్ణాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య దూరాలు ఏర్పడ్డాయన్నారు. కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి ఉండేందుకు ప్రజల మధ్య ఆత్మీయ బంధాలను బలోపే తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక వి భాగ్‌ సంయోజక్‌ బాల్‌రాజ్‌గౌడ్‌, గౌరవ అధ్యక్షుడు రాంచంద్రం, జిల్లా అధ్యక్షుడు అమృత రాజేందర్‌, ప్ర ధాన కార్యదర్శి మన్నె కృష్ణ, ప్రతినిధులు కృష్ణమూర్తి, ప్రశాంత్‌, భాస్కర్‌రావు, రాజేశ్వర్‌, భగత్‌, పూల్‌సింగ్‌, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement