జాతీయస్థాయి కబడ్డీ శిబిరానికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి కబడ్డీ శిబిరానికి ఎంపిక

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

జాతీయస్థాయి కబడ్డీ శిబిరానికి ఎంపిక 16న జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు నెట్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు కాంస్యం డిస్టిలరీ సెక్షన్‌లో పూజలు పొల్కంపేటలో మద్య నిషేధం

కామారెడ్డి టౌన్‌: వేములవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలు జాతీయ స్థాయి శిబిరానికి ఎంపికై నట్లు కామారెడ్డి కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. రాజన్న సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో 9వ తరగతి చదువుతున్న రిషిక అండర్‌–16 జాతీయస్థాయి కబడ్డీ శిబిరానికి, గాంధారి మండలానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని ఉష జూనియర్‌ నేషనల్‌ కబడ్డీ శిబిరానికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. రాబోయే జాతీయ పోటీల్లోనూ విద్యార్థులు రాణించి మెడల్స్‌ సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా 73వ సీనియర్‌ బాలికల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 16న నిర్వహించనున్నట్లు కామారెడ్డి కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.రాజన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ మైదానంలో ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణులు తప్పనిసరిగా 75 కిలోల బరువు లోపు ఉండాలని తెలిపారు. పదో తరగతి మార్కుల మెమో, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ టీజీ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాల మైదానంలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్‌ నెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు క్యాంస పతకం సాధించింది. జిల్లా జట్టు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో పతకం సాధించడంపై అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఈ.శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి బి.రాఘురామ్‌లు హర్షం వ్యక్తంచేశారు. క్రీడాకారులను పలువురు అభినందించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అడ్లూర్‌ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్‌ ఫ్యాక్టరీలోని డిస్టిలరీ సెక్షన్‌లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిల్లింగ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ రావు, ఫైనాన్స్‌ మేనేజర్‌ మాలకొండయ్య, పర్సనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, డిస్టలరీ జీఎం సుబ్బారావు, వివిధ విభాగాల జీఎంలు వీరరాజు, ఉమామహేశ్వర రావు, కుటుంబరావు, శ్రీనివాస్‌ రెడ్డి, డిస్టలరీ మేనేజర్‌ రెడ్డయ్య, ఐఎన్‌టీయూసీ ప్రధానకార్యదర్శి మహేశ్‌, ఉద్యోగులు రాజరమేశ్‌, తిరుపతి, శ్రీధర్‌, శెకెల్లి రాజు, రవి, అశోక్‌, శివకుమార్‌, కార్మికులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మద్య నిషేధం విధిస్తూ మండలంలోని పొల్కంపేట గ్రామం ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధిస్తామని, మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ. పదివేలు నజరాన అందిస్తామని సోమవారం గ్రామస్తులంతా ఏకమై తీర్మానించారు. సర్పంచ్‌ దివిటి రమేశ్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్టు షాపుల నిర్వహణతో యువకులు, రైతులు, కూలీలు వ్యసనానికి బానిసై అనారోగ్యానికి గురవుతుండడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామస్తుల సహకారంతో మద్య నిషేధం విధించుకున్నట్లు సర్పంచ్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం రెండు సంవత్సరాలపాటు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement