ముస్తాబైన ఆలయాలు, మండపాలు | - | Sakshi
Sakshi News home page

ముస్తాబైన ఆలయాలు, మండపాలు

Oct 11 2026 1:27 AM | Updated on Oct 11 2026 1:27 AM

ముస్తాబైన ఆలయాలు, మండపాలు

దోమకొండ/ మద్నూర్‌/ నిజాంసాగర్‌: దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు ఉంటాయని అర్చకుడు భావి శరత్‌చంద్ర శర్మ తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి తెలిపారు. మద్నూర్‌లోని పోచమ్మ ఆలయానికి రంగులు దిద్ది అందంగా అలంకరించారు. మద్నూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో , నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొల్పే దుర్గామాత మండపాలకు మాత విగ్రహాలను నిర్వాహకులు తరలించారు.

దోమకొండలో ముస్తాబైన చాముండేశ్వరి ఆలయం

మద్నూర్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement