ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు. మామిడిపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీలో 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
దుప్యతండాలో కలప..
సిరికొండ: సిరికొండ రేంజ్ పరిధిలోని దుప్యతండాలో మాలావత్ తిరుపతి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకున్నట్లు ఎఫ్‌ఆర్వో నర్సింగ్‌రావు శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం తిరుపతి ఇంట్లో తనిఖీ చేయగా 23 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.


