ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

Oct 11 2026 1:27 AM | Updated on Oct 11 2026 1:27 AM

భిక్కనూరు: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో సుమారు 54 ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్‌ తెలిపారు. భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురిని గతంలోనే అరెస్టు చేయగా హైదరాబాద్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన తక్‌ షంషేర్‌ సింగ్‌ తప్పించుకున్నాడన్నారు. మండలంలో అతడు ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగిలించేందుకు రెక్కి నిర్వహిస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో 35 కేసులు మెదక్‌ జిల్లాలో 19 కేసులు ఉన్నాయన్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఆకై ్సడ్‌ బ్లేడ్‌లు, రెండు కటింగ్‌ ప్లేయర్స్‌, రెండు పానాలు, ఒక కట్టర్‌, ఒక సైకిల్‌ ట్యూబ్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ నరేష్‌, ఎస్సై అనిల్‌, ఏఎస్సై వెంకట్‌రావు, కానిస్టేబుళ్లు బాలక్రిష్ణ, శ్రీకాంత్‌, కిషన్‌గౌడ్‌, శేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement