భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఎదుల్‌మియా(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గత నెల 25న తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఇప్పటికీ తిరిగి రాలేదన్నారు. కుటుంబీకులు ఎంతవెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడు ఆరు ఫీట్ల పొడవు, చామనచాయ, కోల ముఖం తెల్ల గడ్డం తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాడన్నారు. తెలుగు, హిందీ భాషలు మాట్లాడుతాడన్నారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఎస్సై వివరించారు.
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులోగల హైవేపై సోమవారం ఓ కారు కల్వర్టును ఢీకొట్టింది. గ్రామ శివారులోని సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై దెగ్లూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి, పక్కకు వెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడగా, మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కేశారం గ్రామ అటవీ ప్రాంతంలో ఎనిమిది గైరి చెట్లను కొట్టి పొలానికి తరలించిన ఎడిపల సాయన్న అనే వ్యక్తికి రూ.9,980 రూపాయల జరిమానా విధించినట్లు ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ భట్ సోమవారం తెలిపారు. చెట్లను గుర్తించిన సెక్షన్ అధికారి మానస, బీట్ అధికారి నవీన్ రాజ్‌లను ఎఫ్‌ఆర్‌వో అభినందించారు.


