ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి..

● సిలబస్‌తోపాటు పరీక్ష

విధానంలో మార్పులు

● ప్రస్తుత విద్యాసంవత్సరం

నుంచే 80:20 విధానం అమలు

ఆర్మూర్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యావిధానంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే కీలక సంస్కరణలు అమలులోకి రానున్నాయి. తెలంగాణ ఇంటర్‌ బోర్డు (టీజీబీఐఈ) ఫస్టియర్‌ సెలబస్‌, పరీక్షా విధానాన్ని పూర్తిగా మార్చింది. అలాగే ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సబ్జెక్టుల వారీగా రాత పరీక్ష, ప్రాక్టికల్స్‌కు ఎన్ని మార్కులు కేటాయిస్తారనే వివరాలను ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ఇటీవల తెలిపారు.

సైన్స్‌, మ్యాథ్స్‌ కోర్సులకు..

ప్రస్తుతం ప్రాక్టికల్స్‌ను రెండు సంవత్సరాలకు విభ జించారు. ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జు వాలజీ నాలుగింటికి ఇదే వర్తిస్తుంది. అలాగే మ్యా థ్స్‌–ఏ, మ్యాథ్స్‌–బీలకు ఆక్టివ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ (ఏబీ ఎల్‌) పేరుతో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. ఫస్టియర్‌, సెకండియర్‌ రెండింటిలోనూ 15 మార్కులు ఇంటర్నల్‌, 60 మార్కులు థియరీ ఉంటుంది. గతంలో థియరీ 75 మార్కులకు ఉండేది.

ఆర్ట్స్‌, కామర్స్‌, లాంగ్వేజెస్‌కు..

కామర్స్‌,ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ప బ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ వంటి హ్యూమనిటీస్‌ (ప్రాక్టికల్స్‌ లేని) సబ్జెక్టులకు, అలాగే తెలుగు,ఇంగ్లీ ష్‌, హిందీ, ఉర్దూ భాషలకు 20 మార్కులు ఇంటర్నల్‌, 80 మార్కులు థియరీ విధానం అమలు చేస్తారు. ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో ఫస్టియర్‌లో ఒకటే పాఠ్య పుస్తకం, సెకండియర్‌లో రెండో పాఠ్య పుస్తకంతోపాటు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ మాన్యువల్‌ ఉండనుంది.

వేధిస్తోన్న ల్యాబ్‌ల కొరత..

కొత్త విధానంతో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్‌ సదుపాయాల కొరత ప్రధాన సమస్యగా మారనుంది. దీనిని అధిగమించేందుకు బోర్డు టీ–స్టెమ్‌ తెలంగాణ న్‌సైన్స్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ ఫెసిలిటీ మ్యాప్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా ఒక కళాశాల ల్యాబ్‌ను పక్కనే ఉన్న ఇతర కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు ఉమ్మడిగా వినియోగించుకోవచ్చు. అలాగే కొత్త పుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. కెమిస్ట్రీ సిలబస్‌లో 30 శాతం తగ్గించారు. పుస్తకాలన్నీ రంగుల్లో, క్యూఆర్‌ కోడ్‌ లతో ముద్రించి పంపిణీ చేయనున్నట్లు సమాచారం. తెలుగు పుస్తకంలో తెలంగాణ చరిత్ర, సంస్కతికి సంబంధించిన అంశాలు చేర్చారు. కళాశాలల యాజమాన్యాలు ఇంటర్నల్‌ మార్కులలో అక్రమాలకు పాల్పడకుండా బోర్డు కామన్‌ వ్యాలిడేషన్‌ రూల్స్‌ (సీవీఆర్‌)ను జారీ చేసింది. ఇంటర్నల్‌ మార్కుల నిర్వహణ, రికార్డింగ్‌, సబ్మిషన్‌కు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ మార్పులపై జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి ఆదేశించారు.

ఏఐతో రూపొందించిన ప్రతికాత్మక చిత్రం

ఇంటర్మీడియట్‌ బోర్డు మార్చిన ఈ నిబంధనలతో విద్యార్థుల్లో మొదటి సంవత్సరం నుంచే నైపుణ్యాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ఉన్నత విద్యనభ్యసించే సమయంలో ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. –అర్గుల చిన్నయ్య,

ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఐలాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement