భిక్కనూరు: సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై దేవేందర్ అన్నారు. ఈమేరకు భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై స.హ. చట్టం కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమాచారహక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎ సలీం, కామారెడ్డి జిల్లా విభాగం మహిళ కార్యదర్శి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
బీబీపేట:చదువు మధ్యలో నిలిపివేసిన వారికి, ఉ ద్యోగులు, విద్యార్థులకు ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్ర వేశం పొందేందుకు చివరి అవకాశం కల్పించినట్లు టీఎస్‌ఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా ఈ నెల 12వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 94406 30433, 8985614470 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


