తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకుని, సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఎథికల్ హ్యాకర్, సైబర్ డ్వార్ ల్యాబ్స్ ప్రతినిధి అమిత్ రాజ్ కర్మాకర్ అన్నారు. తెయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో సైబర్ డ్వార్ ల్యాబ్స్ సహకారంతో సోమవారం ‘ఎథికల్ హ్యాకింగ్’ అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆధునిక హ్యాకింగ్ విధానాలు, వాటివల్ల ఎదురయ్యే సైబర్ ముప్పులు, వాటిని గుర్తించడం, నివారించే మార్గాలపై అమిత్ రాజ్ కర్మాకర్ అవగాహన కల్పించారు. మేనేజ్‌మెంట్ డీన్ సీహెచ్.అంజనేయులు మాట్లాడుతూ.. సాంకేతికంగా అభివృద్ధి చెందిన నేటి సమాజంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎలాంటి మోసాలకు గురికాకుండా చాకచక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. తె యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు, వాణి, కిరణ్ రాథోడ్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


