కామారెడ్డి క్రైం: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీఎంఆర్ విషయంలో గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా రైస్‌మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు జరుగుతాయో, లేదోననే సందేహాలున్నాయి. ఈ వ్య వహారంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ధాన్యాన్ని నిల్వచేయడంపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రయివేటు భవనాలు, గోదాంలు, ఫంక్షన్ హాళ్లను గుర్తిస్తున్నారు.
అనుమతిస్తే 123 మిల్లులకే..
గతంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లను నేరుగా రైస్‌మిల్లులకు పంపేవారు. తీసుకున్న వడ్లను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో అక్రమాలు చేయడంతో కొందరు రైస్‌మిల్లర్లు డిఫాల్టర్లుగా మారారు. జిల్లావ్యాప్తంగా 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. జిల్లాలో గతంలో సీఎంఆర్ ఇచ్చే మిల్లులు 160కి పైగా ఉండేవి. డిఫాల్టర్లుపోను ఈ సీజన్‌కు 130 మిల్లులను బియ్యం కేటాయింపులకు ఎంపిక చేశారు. వాటిలో నుంచి సీఎంఆర్ తిరిగి ఇవ్వక ఇటీవల కేసులు నమోదైన మరో 7 రైస్‌మిల్లులను తొలగించారు. తాజా లెక్కల ప్రకారం ప్రభుత్వం అనుమతిస్తే 123 రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. మిల్లర్లకు ధా న్యం కేటాయింపుల విధివిధానాలు ఏవిధంగా ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రావా ల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ధాన్యం నిల్వ చేయడానికి స్థలాలను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలుంటాయి.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, కామారెడ్డి
ధాన్యం నిల్వ స్థలాల గుర్తింపు కోసం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సహా సంబంధిత శాఖల జిల్లా అధికారులు క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తున్నారు. గోదాములు, డిఫాల్ట్ రైస్ మిల్లులు, ఫంక్షన్‌హాళ్లులాంటి ఇతర ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని గుర్తించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ పరిసర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వ చేసేందుకు స్థలాలు, భవనాలను పరిశీలిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న
ధాన్యం సేకరణ
రైస్‌మిల్లర్లకు నేరుగా ధాన్యం
కేటాయింపులపై సందిగ్ధత
ముందు జాగ్రత్తగా స్టోరేజీకి
ప్రయివేటు స్థలాలు, భవనాల గుర్తింపు


