జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారులు అధ్వానంగా మారాయి. ఓ రోడ్డంతా గుంతలమయంగా మారితే.. మరో రోడ్డుపై కల్వర్టు కూలి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ గండాల దారులను దాటాలంటే వాహనదారులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
తాడ్వాయి మండల కేంద్రంలోని ధ్వంసమైన కల్వర్టుతో ప్రమాదం పొంచి ఉంది. గ్రామంలోని శబరిమాత ఆశ్రమం సమీపంలో గల కామారెడ్డి–ఎల్లారెడ్డి రహదారిపై కల్వర్టు ధ్వంసమై, శిథిలావస్థకు చేరింది. కల్వర్టు వద్ద గొయ్యి ఏర్పడి ఏడాదవుతున్నా దాన్ని పూడ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


