వేతన.. వేదన | - | Sakshi
Sakshi News home page

వేతన.. వేదన

Aug 3 2026 1:25 AM | Updated on Aug 3 2026 1:25 AM

త్వరలోనే వేతనాలు

మానసిక వేదనకు గురవుతున్నాం

ఎల్లారెడ్డిరూరల్‌: వీబీ జీ రామ్‌ జీ (ఉపాధి హామీ) క్షేత్ర సహాయకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పనుల ఎంపిక, కూలీలు హాజరయ్యేలా వారిలో చైతన్యం తీసుకరావడం, రిజిస్టర్లలో వివరాల నమోదు తదితర పనులు చేపడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబపోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జిల్లాలో 4.71 లక్షల మంది కూలీలు

జిల్లాలో 2.49 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా వీటి పరిధిలో 4.71 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీటిలో యాక్టివ్‌ జాబ్‌కార్డులు లక్షా 41 వేలు ఉండగా, యాక్టివ్‌ కూలీలు 2.25 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి కూలీలు 29.34 లక్షల పనిదినాలను పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 270 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గత మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించిన వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

ఉపాధి హామీ సిబ్బందికి త్వరలోనే వేతనాలు అందుతాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సంబంధించిన వేతనాల బిల్లులు ఉన్నతాధికారులకు పంపించాం.

– తాహేరాబేగం, ఎంపీడీవో, ఎల్లారెడ్డి

మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందిగా ఉంది. పిల్లల స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు కొనుగోలు చేయలేదు. కుటుంబ పోషణ భారమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా వేతనాలు నెలనెలా వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

– హసన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు, ఎఫ్‌ఏల సంఘం

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మూడు నెలలుగా

అందని వేతనాలు

జిల్లాలో 270 మంది ఎఫ్‌ఏలు

ఉపాధి హామీ సిబ్బందికి

ఆర్థిక ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement