నిషేధిత మాంజా స్వాధీనం
ఎల్లారెడ్డి: పట్టణంలో శనివారం నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలలో ఎస్సై బొజ్జ మహేష్ తనిఖీలు నిర్వహించారు. మాంజా విక్రయాలు చేపట్టిన పద్మ బాలకృష్ణ, బెస్త మల్లేష్ అనే ఇద్దరు యజమానులపై పలు సెక్షన్లతో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 వేల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. చైనా మాంజా వాడకం వల్ల పక్షులు, ప్రజలకు ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పండుగల సమయంలో ఇలాంటి నిషేధిత వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. పట్టణంలో తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.


