క్రీడలు దేశ ఐక్యతలో భాగం
● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
● 11వ జోనల్ లెవల్ గేమ్స్–స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఆర్మూర్: క్రీడలు దేశ ఐక్యతలో భాగమని, విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని ఆ ర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూ ర్ పట్టణం పిప్రి రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురు కుల పాఠశాల మైదానంలో తెలంగాణ సోషల్ వె ల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే బాసర 2 జోన్ పరిధిలోని 11వ జోనల్ లెవల్ గేమ్స్–స్పోర్ట్స్ మీ ట్‌ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని నిజామాబాద్ ఉమ్మ డి జిల్లాతోపాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీలతో ఆరోగ్యంతోపాటు మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచకప్ సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపా రు. క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యేగా తన పూర్తి సహా య సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీషర్టులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్మూ ర్, వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఆయా జిల్లాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు నిరంజన్, గంగాధర్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, బీజేపీ నాయకులు మందుల బాలు, కేసీ ముత్యం తదితరులు పాల్గొన్నారు.


