యువత దేశభక్తి కలిగి ఉండాలి
బోధన్: యువత నాయకత్వం, క్రమశిక్షణ లక్షణాలు, దేశభక్తి క లిగి ఉండాలని నిజామాబాద్ 12వ తెలంగాణ బెటాలియన్ ఎ న్‌సీసీ కమాండెంట్ లెిఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నా రు. ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన 12వ తెలంగాణ బెటాలియన్ ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరం గత నెల 29న ప్రారంభం కాగా గురువారం ముగిసింది. ఆఖరి రోజు శిక్షణ ముగింపు వే డుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అథితిగా విచ్చేసి న లెిఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ ఎన్‌సీసీ వి ద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.శిక్షణలో సాధన చేసిన అంశాలను దై నందిన జీవితంలో ఆచరించి ఎంచుకున్న నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు అడు గులు వేయాలని సూచించారు. ఇందుకు శి క్షణ ఎంతోదో హ దపడుతుందన్నా రు. అసోసియేట్ క్యాంప్ ఇన్‌చార్జి నాగేశ్వర్‌రావు మా ట్లాడుతూ.. ఎన్‌సీ సీ శిక్షణ పది రోజు ల పాటు కొనసాగిందని,వివిధ ప్రాంతాల నుంచి 571 మంది విద్యార్థులు పా ల్గొ న్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివి ధ క్రీడలు,ప్రతిభా పోటీల్లో విజేతలకు మెడల్స్ అందించి అభినందించారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్‌సీసీ బెటాలియన్ ఉద్యోగులు, కెడెట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


