ఆపన్నహస్తం అందించరూ..
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పండగ చంద్రకళకు ఆపన్నహస్తం అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. చంద్రకళ నాలుగు నెలల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆస్పత్రిలో చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దాతలు ముందుకొచ్చి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా 9441952830 కృష్ణమూర్తి నెంబర్‌కు అందించాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సరంపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్ఠికాహార భోజనం అందించాలన్నారు.
ధాన్యం లారీ బోల్తా
ఎల్లారెడ్డి: మండలంలోని కొట్టాల్ శివారులో ధాన్యం లారీ బోల్తా పడినట్లు ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు ధాన్యం బస్తాలతో వస్తున్న లారీని డ్రైవర్ అమ్రేష్‌సింగ్ అజాగ్రత్తగా, అతివేగంగా నడిపి చెట్టును ఢీకొనడంతో బోల్తా పడిందన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సిద్ధిఖీ అన్నారు. గురువారం మర్కల్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటే చెప్పవద్దన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి, పోలీసు సిబ్బంది సంజయ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
బోధన్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీ కరించిన, సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, తిరస్కరించిన దరఖాస్తుల వివరాల ఫైల్స్‌ను తన ఆఫీస్‌లో సమ ర్పించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ తో సాలూర తహసీల్దార్ శశిభూషణ్‌ను ఆదేశించారు. గురువారం సాలూర తహసీల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. రెవెన్యూ సద స్సు దరఖాస్తులు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం పురోగతి పై సమీక్షించారు.
ఆపన్నహస్తం అందించరూ..
ఆపన్నహస్తం అందించరూ..
ఆపన్నహస్తం అందించరూ..


