పేటెంట్లు, డిజైన్ ఫైలింగ్‌పై ఆన్‌లైన్ వర్క్‌షాప్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్, భారత ప్రభుత్వం, నాగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ‘మేధోసంపత్తి హక్కులు–పేటెంట్లు, డిజైన్ ఫైలింగ్’ అనే అంశంపై ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్–డిజైన్స్ (నాగపూర్) ప్రొఫె సర్ భారత్ ఎన్.సూర్యవంశి ప్రసంగిస్తూ మేధో సంపత్తి.. మానవ మేథస్సు ద్వారా సృష్టించబడిన ఆస్తి అని, దానిని స్పర్శనీయ, అస్పర్శనీయ ఆస్తులుగా విభజించవచ్చన్నారు. పరిశ్రమ సంబంధ ఆస్తులు, కాపీరైట్లు, పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు, ఇండస్ట్రియ ల్ డిజైన్లు, భౌగోళిక సూచికలు ఇంటిగ్రేటెడ్ స ర్క్యూట్ లేఅవుట్ డిజైన్‌లు, మొక్కల వర్గాల పరిరక్షణ, రైతుల హక్కులు, వాణిజ్య రహస్యాల పరిరక్ష ణ ప్రధానమైనవని వివరించారు. పేటెంట్ హక్కు లు దరఖాస్తు చేసిన తేదీ నుంచి 20 సంవత్సరాలపాటు ప్రభుత్వం వారీగా పేటెంట్ హోల్డర్‌కి ప్రత్యే క హక్కులను అందిస్తాయని తెలిపారు. ట్రేడ్‌మార్క్ హక్కులు పది సంవత్సరాలపాటు మంజూరు చే యబడతాయని, వినియోగం కొనసాగినంత కాలం పునరుద్ధరించవచ్చునన్నారు. ప్రభుత్వ రంగంలో పేటెంట్లు– డిజైన్‌ల ఎగ్జామినర్, ట్రేడ్‌మార్క్– జి యోగ్రాఫికల్ ఇండికేషన్ ఎగ్జామినర్, కాపీరైట్ ఎగ్జామినర్, ప్రైవేట్ రంగంలో పేటెంట్ ఏజెంట్, ట్రేడ్‌మార్క్ ఏజెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వివరించారు. తెలంగాణ వర్సిటీ ప్రొఫెసర్లు ఎం.అరుణ, బి.విద్యావర్థిని, అబ్దుల్ హలీం ఖాన్, డాక్ట ర్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.


