క్రైం కార్నర్
బాల్కొండ: మండలంలోని బోదేపల్లి శివారులో వ్య వసాయ విద్యుత్ మోటర్ల నుంచి వైర్ దొంగిలించిన కేసులో చిట్టాపూర్‌కు చెందిన పుట్ట నాగేశ్, ఆలూర్ మండల కేంద్రానికి చెంచు పుట్ట నరేశ్‌లకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఆర్మూర్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సరళరాణి గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. కేసులో నిందితులపై చార్జీషీట్ దాఖలు చేయగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ3గా ఉన్న అనీష్ బేగంకు రూ.1500 జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
న్యూసెన్స్ చేసిన ముగ్గురు మహిళలకు..
నిజామాబాద్‌అర్బన్: మగవారిని ఆకర్షిస్తూ న్యూసె న్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు కోర్టు రెండు రో జుల జైలు శిక్ష విధించిందని ఒకటో టౌన్ ఎస్‌హెచ్ వో రఘుపతి తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలోని బస్టాండ్‌లో కళావతి, కరోల్ల లత, దుర్గ మగవారిని ఆకర్షించి ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ఎదుట హాజరుపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.


