కళ్లకు గంతలతో నిరసన
కామారెడ్డి టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్: జిల్లా కార్యదర్శి ఆరుణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం నాలుగు రోజులుగా డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్, ఉన్నత విద్యా సంస్థలను బంద్ చేసినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


