
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. బైక్‌పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. అధిక వేగం మంచిది కాదన్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే చలానాలు జారీ చేస్తామన్నారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై మహేష్, టౌన్ ఎస్సై నరేశ్ తదితరులు ఉన్నారు.
యూనిఫామ్‌ల పంపిణీ
కామారెడ్డి క్రైం : దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలోని సివిల్ సప్లై హమాలీల కు మంగళవారం యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ వారికి యూనిఫామ్‌లతో పాటు స్వీట్లు అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దశర థ్, జిల్లా కార్యదర్శి బాలరాజ్, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి బా జీ, జిల్లా కోశాధికారి మహీపాల్, ఆయా సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్, కృష్ణ, సాయి లు, రవి, రమేష్, నర్సింలు, బాబు, హనుమాండ్లు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ బుధవారం ప్రారంభం కానుంది. ఆహారభద్రత కార్డులపై ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులపై 10 కిలోల చొప్పున అందిస్తారు. ఈనెల ఒకటో తేదీనుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా ఆరునెలలుగా రావాల్సిన కమీషన్ కోసం రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే కమీషన్ వచ్చేలా చూస్తామని సివిల్ సప్లై కమిషనర్ హామీ ఇవ్వడంతో దుకాణాల బంద్ నిర్ణయా న్ని వెనక్కి తీసుకుని, యథావిధిగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు డీలర్ల సంఘం ప్రతినిధులు ప్రకటించారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి