
రుణమాఫీ పథకం వందశాతం అమలు చేయాలి
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకాన్ని వందశాతం అమలు చేయాలని రామేశ్వర్‌పల్లి రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం రామేశ్వర్‌పల్లిలో విండో చైర్మన్ నాగార్తి భూంరెడ్డి అధ్యక్షతన 68వ విండో మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో రైతులు పలు తీర్మానాలను ఆమోదించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లో హమాలీ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని తీర్మానించారు. కార్యక్ర మంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ మద్ది సూర్యకాంత్‌రెడ్డి, ప్రతినిధులు పోతిరెడ్డి, నర్సారెడ్డి, విండో సీఈవో శంకర్, వైస్‌చైర్మన్ శేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.