
దసరా ఉత్సవాలకు ముస్తాబైన బురుజు
దోమకొండ: దోమకొండలోని బురుజును విద్యుత్ దీపాలతో దసరా కోసం ముస్తాబు చేశారు. గురువారం బురుజుపై జాతీయ జెండాను ఎగురువేయడానికి ఏర్పాట్లు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేయడానికి జనం భయపడేవారు. ఇక్కడి జనం స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేశారు. నిజాం కాలం నుంచే ఇక్కడ దసరా ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇక్కడ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయటానికి నిజాం పాలకులకు భయపడేవారు. దోమకొండలో 1947 సెప్టెంబర్ 8న ఇక్కడి పాలకులకు తెలవకుండా 23 ఫీట్ల పొడవు, 46 ఫీట్ల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేసి 12 మీ. పొడవు, 2 మీ. వెడల్పు గల దుంగకర్రకు పెట్టి అప్పటి యువకులు ఎగురవేశారు. దీంతొ ఇక్కడి యువకులు కొందరు జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ప్రతి దసరా రోజున జాతీయ జెండాను ఎగురవేయటం ఆనవాయితీగా వస్తోంది. దసరా ఉత్సవంలో భాగంగా దోమకొండలోని బురుజు వద్ద ఆయుధ పూజ చేస్తారు. ప్రతీ ఏటా స్థానిక సర్పంచి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవటంతో గ్రామ ప్రత్యేకాధికారి జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు. అనంతరం జమ్మీ వృక్షానికి పూజ చేసి, చాముండేశ్వరి ఆలయానికి ఎదుర్కొని వెళ్తారు. ఇక్కడ జమి చెట్టును తాకి ఇంటికి తీసుకెళ్తే అదృష్టవంతులు అవుతారని నమ్మకంతో చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ ఏడు సైతం ఉత్సవాలను విజయవంతంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మిషన్ భగీరథ ఫ్రీ వాటర్ సర్వీస్
రామారెడ్డి: దసరా పండుగకు వాహనాలను సర్వీసింగ్ చేయించుకోవడం, పూజ చేయించడం సాధారణం. మరి గురువారం దసరా పండుగ అయితే బుధవారమే చాలా మంది తమ వాహనాలను వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటారు. కానీ రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర భగీరథ పైప్ లీకేజీతో వాహనాలు ఫ్రీ సర్వీసింగ్ అయ్యాయి. మిషన్ భగీరథ అంటేనే లీకేజీల భగీరథ అనే పేరు సార్థకమైంది. ఆ రోడ్డులో వచ్చిపోయే తమ వాహనాలను అక్కడ ఉంచి శుభ్రం చేసుకున్నారు.

దసరా ఉత్సవాలకు ముస్తాబైన బురుజు