
రాజకీయ పార్టీలు సహకరించాలి
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రచారం, ప్రచార ఖర్చులు, ఓటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి తదితర అంశాలను పార్టీల ప్రతినిధులకు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్‌నాయక్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కై లాస్ శ్రీనివాస్‌రావు, కుంబాల రవియాదవ్, చంద్రశేఖర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.