
పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: ప్రపంచంలో పువ్వులను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మహిళ ఉద్యోగినులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులతో వైభవంగా నిర్వహించామన్నారు. ఎంతో పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు సంతోషంగా ఈ పండుగలో పాల్గొన్నారని తెలిపారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
చైతన్యానికి ప్రతీక బతుకమ్మ
భిక్కనూరు: తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరంగల్, వేముల ప్రాంతాల్లో 1000 ఏళ్ల క్రితం ప్రారంభమైన బతుకమ్మ తెలంగాణ ప్రజల పండుగ అని ఏ ఒక్క పార్టీ పండుగ కాదన్నారు. బతుకమ్మ మహిళలను ఒకచోట చేర్చి ఆడుతూ పాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. బతుకమ్మ పాటలు సమాజంలోని రుగ్మతలను కూడా పారదోలుతాయన్నారు. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మను స్థానిక చెరువు కుంటల్లో నిమజ్జనం చేయడం వెనుక సైన్స్ దాగి ఉందన్నారు. బతుకమ్మను పేర్చే గునుక, తంగెడి పూలల్లో ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు ఔషధ నీరుగా మారుతుందన్నారు. అందంగా బతుకమ్మలను పేర్చిన వారికి బహుమతులను అందజేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల రేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ