
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ శివారులో ఉన్న పొలంలో నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. ఎస్సై సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్ శివారులోని రెండు 25 కేవీ, మరో రెండు 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. సోమవారం ఉద యం గమనించిన రైతులు విద్యుత్ శాఖ ఏఈ నాగశైర్వానీ, లైన్‌మన్ మనోహర్‌కు సమాచా రం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.