
గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపిక
భిక్కనూరు: కరీంనగర్ జి ల్లాకు చెందిన శ్రీజారెడ్డి భిక్కనూరులోని తెలంగా ణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో జియోఇన్‌ఫర్‌మెటిక్స్ ద్వితీయ సంవ త్సరం పూర్తి చేసుకుంది. ఇటీవల గ్రూప్–2 పరీక్ష రాయగా, ఫలితాల్లో ఆమె ప్రతిభ చూపి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై ంది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, అఽ ద్యాపకులు నారాయణ గుప్త, ప్రతిజ్ఞ సోమవా రం మాట్లాడుతూ.. శ్రీజారెడ్డి ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక అవడం హర్షణీయమన్నారు.
గ్రూప్1లో 94వ ర్యాంకు
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి చెందిన మున్నం శశికుమార్ గ్రూప్1లో రాష్ట్రస్థాయి 94వ ర్యాంకు సాధించి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌గా ఉద్యోగాన్ని సాధించాడు. ఈమేరకు లేబర్ కమిషనర్ దాన కిషోర్ చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు. శశికుమార్ తల్లితండ్రులు సైతం ఉపాధ్యాయులుగా పని చేసి రిటైర్ అవ్వగా, తండ్రి ఇటీవలే మృతి చెందారు. భార్య మమత సైతం స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి, భార్యల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించినట్లు శశికుమార్ తెలిపారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కల్లుడిపో సమీపంలో వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. మండల కేంద్రానికి చెందిన సాకలి పెద్దొల్ల లక్ష్మి భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గోడలు ధ్వంసమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున కూలిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని లక్ష్మి కోరారు. ఇల్లు కూలిందని అధికారులకు తెలిసినా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
● మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి
పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు ‘ఏ’ గ్రేడు ధాన్యానికి రూ.2,389, ‘బీ’ గ్రేడు ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఏఈవో సవిత, సీఈవో శ్యాం, డైరెక్టర్లు ఆలూర్ నారాయణ రెడ్డి, పుప్పాల ప్రవీణ్, నరేడ్ల గంగారాం, చిట్టెడి చిన్నయ్య, కుంట గంగారెడ్డి, మురళి, కళ్లెం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపిక

గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపిక

గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపిక